కామారెడ్డి : నిజామాబాద్ జిల్లా ప్రజలకు వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizamsagar Project)కు భారీగా ఇన్‌ఫ్లో వస్తుంది. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల 24, 300 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తుందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1388 అడుగుల వరకు నీరు ఉందని తెలిపారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ 17.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.4 టీఎంసీల నీరు నిలువ ఉంది. కాగా నిజాంసాగర్‌కు రిజర్వాయర్‌గా ఉన్న సింగూర్ (Singur Project) ప్రాజెక్టులోకి కూడా గురువారం భారీగా నీరు వచ్చి చేరుతుంది. ఈ ప్రాజెక్టుకు 29.917 టీఎంసీల నీటి నిలువ సామర్ధ్యం కాగా మధ్యాహ్నానానికి 19.253 టీఎంసీల నీరు వచ్చి చేరిందని అధికారులు వివరించారు.