బొల్లారం, మార్చి 22: సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో భారీగా మాదక ద్రవ్యాలను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు సమాచారం అందడంతో బొల్లారం పారిశ్రామికవాడలోని పీఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. నిషేధిత మెపిడ్రిన్ డ్రగ్ పౌడర్ తయారు చేస్తున్నట్టు గుర్తించి 90 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. పదేండ్ల నుంచి వీటిని తయారుచేసి విదేశాలకు తరలిస్తున్నట్టు తెలిసింది.