హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తేతెలంగాణ): తిరుమల శ్రీవారికి ఇద్దరు భక్తులు శుక్రవారం భారీ విరాళాలను అందించారు. బెంగళూరుకు చెందిన బీఎంకే నగేశ్ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.50 లక్షల డీడీని విరాళంగా టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరికి తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. హైదరాబాద్ పెరల్ మినిరల్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వెంకటనాగరాజ 15 టీవీఎస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విరాళంగా అందజేశారు. ఈ బైకుల విలువ రూ.22 లక్షలు ఉంటుందని దాత తెలిపారు.