హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): సంచలనం సృష్టించిన న్యాయవాది స్నప్న (34) హత్యపై రాష్ట్ర మానవ హకుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ) సీరియస్ అయింది. ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు ఫిర్యాదును స్వీకరించి, పోలీసులపై కేసు నమోదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ బండలం కేతిరెడ్డిపల్లిలో గత బుధవారం స్వప్నను కుటుంబసభ్యులు అత్యంత పాశవికంగా హత్య చేయించారు.
దీనిపై న్యాయవాదులు ఆందోళనలు చేపట్టారు. నిందితులపై సత్వర చర్యలు చేపట్టడంలో మొయినాబాద్ సీఐ జీ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐ ఆర్ నర్సింహారావు విఫలమయ్యారని న్యాయవాది రామారావు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును స్వీకరించిన ఎస్హెచ్ఆర్సీ.. పవన్‌కుమార్‌రెడ్డి, నర్సింహారావుపై శుక్రవారం కేసు నమోదు చేసి, నంబర్ కేటాయించింది.