TVK chief Vijay | తిరుచ్చిలో టీవీకే చీఫ్ విజయ్ నామినేషన్.. రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి..!
TVK chief Vijay | తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) తన ఎన్నికల ప్రచారం (Election Campaign) లో దూకుడు పెంచారు. గురువారం ఆయన తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన అభిమానులతో అక్కడ తీవ్ర కోలాహలం, కొంత గందరగోళం నెలకొన్నది.
TVK chief Vijay : తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) తన ఎన్నికల ప్రచారం (Election Campaign) లో దూకుడు పెంచారు. గురువారం ఆయన తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన అభిమానులతో అక్కడ తీవ్ర కోలాహలం, కొంత గందరగోళం నెలకొన్నది. ఇదిలావుంటే విజయ్ నామినేషన్ వేయడానికి వెళ్తున్న ఒక ఘటన చోటుచేసుకుంది. విజయ్ కాన్వాయ్ వెంట వందలాది మంది అభిమానులు పోలీసుల నియంత్రణను సైతం లెక్కచేయకుండా పరుగులు తీశారు.
ఈ సందర్భంగా కాన్వాయ్ పక్కన పరిగెడుతున్న ఓ మహిళ అదుపుతప్పి కిందపడిపోయారు. ఇది గమనించిన విజయ్ వెంటనే తన వాహనాన్ని ఆపి, కిందకు దిగి, గాయపడిన మహిళను వ్యక్తిగతంగా పరామర్శించారు. ఆమె క్షేమంగా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత తన పర్యటనను కొనసాగించారు. ఈ సంఘటనతో అక్కడ కాసేపు ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. అనంతరం తిరుచ్చి తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ముత్తు మురుగేశ పాండియన్‌కు విజయ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
కాగా ఈ ఎన్నికల్లో విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన పెరంబలూరులో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ తర్వాత విజయ్ దివంగత నేత ఎంజీ రామచంద్రన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఉందని, అన్ని కుటుంబాలకు సరఫరా సరిగా అందుతోందా అని అడిగారు. ఇతర విషయాల కోసం ఢిల్లీ వెళ్లే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సిలిండర్ల సమస్యను పరిష్కరించడానికి ఎందుకు వెళ్లలేదని విజయ్ ప్రశ్నిచారు.
విలాత్తికులంలో పాఠశాల బాలిక హత్య ఘటనను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. ప్రజలు తమ భద్రతపై భయంతో బతుకుతున్నారని, రాష్ట్రంలో రాజకీయ మార్పు అత్యవసరమని అన్నారు. అధికారంలో ఉన్న ‘దుష్ట శక్తులను’ ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న విజయ్.. గత ప్రభుత్వాలపై సూటి విమర్శలతో తమిళనాడు రాజకీయాల్లో వేడిని పుట్టించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

