TSRTC Gamyam | సాంకేతికతను అందిపుచ్చుకుని అత్యాధునిక ఫీచర్లతో బస్ ట్రాకింగ్ యాప్ గమ్యంను టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో పుష్పక్ ఎయిర్పోర్టు, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులకు, జిల్లాల్లో పల్లె వెలుగు మినహా అన్ని బస్సులకు ట్రాకింగ్ సదుపాయం కల్పించారు. మనం ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుంది.. ఏ సమయానికి మన వద్దకు వస్తుందనే విషయాలను గమ్యం యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
‘TSRTC Gamyam’ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ http://tsrtc.telangana.gov.in నుంచి కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ డౌన్లోడ్కు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యాప్లో ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. గమ్యం యాప్ను ప్రజలందరూ తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవాలి.
ఇప్పటికే ఇన్ స్టాల్ చేసుకుంటే అప్ డేట్ చేసుకోవడం తప్పనిసరి. టీఎస్ఆర్టీసీ తీసుకువచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలందరూ ఆదరించి, ప్రోత్సహించారు. సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ యాప్ను అలానే ఆదరించాలని సంస్థ కోరుతోంది. ఈ యాప్ పై ఫీడ్ బ్యాక్ ను ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది టీఎస్ ఆర్టీసీ.