UK Breakup | ముక్కలు కానున్న యూకే?.. రెఫరెండం కోసం ఐరిష్, స్కాటిష్, వేల్స్ నాయకుల పట్టు
UK Breakup | యునైటెడ్ కింగ్డమ్ విచ్ఛిన్నం వైపు పయనిస్తున్నట్టు కనిపిస్తున్నది. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌కు నాయకత్వం వహిస్తున్న పార్టీలు గతంలో జరిగిన ఒప్పందంలోని కొన్ని భాగాలను ప్రశ్నిస్తున్నాయి.
UK Breakup | లండన్: యునైటెడ్ కింగ్డమ్ విచ్ఛిన్నం వైపు పయనిస్తున్నట్టు కనిపిస్తున్నది. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌కు నాయకత్వం వహిస్తున్న పార్టీలు గతంలో జరిగిన ఒప్పందంలోని కొన్ని భాగాలను ప్రశ్నిస్తున్నాయి. ఆ పార్టీల నాయకులు తమ ఉమ్మడి ప్రయోజనాలను ఒక సమన్వయ సాధనంగా మార్చడానికి సిద్ధమవుతున్నారు. ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. ఆ మూడు ప్రాంతాల ఫస్ట్ మినిస్టర్లు సోమవారం కార్డిఫ్‌లో సమావేశమై ప్రజాస్వామ్య మార్గాల ద్వారా స్వాతంత్య్రం సాధించే హక్కు సహా స్వీయ నిర్ణయాధికారానికి సంబంధించిన ఒక ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయనున్నారు. వారి సందేశం యూకే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది.
స్కాట్లాండ్ స్వాతంత్య్రంపై జరగబోయే ప్రజాభిప్రాయ సేకరణ గురించి యూకే ప్రధాని బర్న్‌హామ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కార్డిఫ్ సమావేశంలో ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. ఇటీవల హౌస్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడుతూ తగినంత స్పష్టమైన ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే మరో ఓటింగ్ జరుగుతుందని బర్న్‌హామ్ అన్నారు. ఐర్లాండ్ పునరేకీకరణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం ఆ దేశ రాజధాని డబ్లిన్ సందర్శనలో చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐక్య ఐర్లాండ్‌ను చూడాలని తాను కోరుకుంటున్నానని ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలు బ్రిటన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి.
మరోవైపు ‘చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ల స్వాతంత్య్రానికి అనుకూలంగా ఉండే ఫస్ట్ మినిస్టర్లు వాటికి నాయకత్వం వహిస్తున్నారు. తదుపరి భవిష్యత్తుకు యూకే ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి’ అని స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ముఖ్యమైన రాజ్యాంగ మార్పు వాదన కాదనలేనిదని.. ఆండీ బర్న్‌హామ్ ఇప్పుడు యూకే చివరి ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయే ఆలోచనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ‘రేపు కార్డిఫ్‌లో మా మూడు దీవులకు కావాల్సిన మెరుగైన భవిష్యత్తు గురించి మిగతా ఫస్ట్ మినిస్టర్లతో చర్చిస్తాను. స్వాతంత్య్రం కావాలనే అంశంతో అది మొదలవుతుంది’ అని స్విన్నీ అన్నారు. గుడ్ ఫ్రైడే ఒప్పందం ప్రకారం ఐర్లాండ్‌తో పునరేకీరణపై రెఫరెండం నిర్వహించే రాజ్యాంగబద్ధ మార్గం ఉత్తర ఐర్లాండ్‌కు ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

