Samagra Kutumba Survey | హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఇంటింటి సర్వే చేసి అన్నికులాల సా మాజిక, ఆర్థిక తదితర అంశాలపై కచ్చితమైన లెక్కలు తీసి న్యాయం చేస్తామని కాంగ్రెస్ స ర్కారు ఊదరగొడుతున్నా ఆచరణలో మా త్రం అందుకు భిన్నమైన పరిస్థితులే నెలకొన్నాయి. సర్వేకు ప్రామాణికత ఏమిటనే ప్రశ్నలను మేధావివర్గం, బీసీ కులసంఘాలు సందేహాలను వ్యక్తపరుస్తున్నాయి. ఆయా కుటుంబాలు చెప్పే సమాచారం నిజమా? కాదా? అని ఏ ప్రాతిపదికగా నిర్ధారిస్తారు? అలాంటి తులనాత్మక అధ్యయనం లేకుండా కచ్చితమైన సమాచారం ఏవిధంగా వస్తుందని గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో సర్వే ప్రామాణికతనే ప్రశ్నార్థకంగా మారనుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎంబీసీలు, ఎస్సీ ఉపకులాల ప్రజలు తీవ్ర అభ్యంతరాలను వెలిబుచ్చుతున్నారు.
ఇంటింటి సర్వేకు స్టిక్కరింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. నేటి నుంచి ఇంటింటికీ తిరిగి సమాచారాన్ని సేకరించనున్నారు. కుటుంబ యజమానులను కలిసి ప్రధాన, ఉప కలిపి మొత్తంగా 75ప్రశ్నలతోకూడిన ఫారాలను పూర్తిగా నింపాల్సి ఉంది. దాదాపు ఈ ప్రక్రియ 10రోజుల పాటు కొనసాగనుం ది. వాస్తవంగా ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, కులాల)ను నిర్వహిస్తామని సర్కారు స్పష్టం చేసింది. కానీ సర్కారు మాత్రం సహేతుకమైన అధ్యయనం చేపట్టకుండా సర్వేను చేపడుతున్నదని మేధావివర్గం, బీసీ సంఘాలు మండిపడుతున్నాయి.
ఎన్యూమరేటర్లకు సర్వే చేపట్టాల్సిన ఇండ్ల సమాచారాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. సర్వే పత్రాలు మాత్రమే అందజేసి ఇంటింటికీ వెళ్లి కుటుంబాలు ఇచ్చే వివరాలను నమోదు చేసుకురావాలని నిర్దేశించింది. ఇక్కడే అసలు సమస్య మొదలుకానుందని సామాజికవేత్తలు వివరిస్తున్నారు. ఆయా కుటుంబ సభ్యులు ఇచ్చే కులం, వృత్తి, ఆస్తులు, ఆదాయ వివరాలు సరైనవేనా? కాదా? అనేది ఎన్యూమరేటర్లు ఎలా తెలుసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. గృ హయజమానులు ఇచ్చే సమాచారం మీదే ఆ ధారపడితే సర్వే ప్రామాణికతనే దెబ్బతింటుందని సామాజికవేత్తలు తేల్చిచెబుతున్నారు.
ఇదిలా ఉంటే సర్వేకు సంబంధించి ఎస్సీ ఉపకులాలు, అత్యంత వెనకబడిన వర్గాలు (ఎంబీసీ), సంచారజాతులకు చెందిన మేధావివర్గం ఆందోళన వ్యక్తంచేస్తున్నది. తెలంగాణ ఏర్పాటు తరువాత 59 షెడ్యూల్డ్ కులాలను, 32 షెడ్యూల్డ్ తెగలను ప్రభుత్వం గు ర్తించింది. ఎస్సీకి సంబంధించి అనేక కులా లు ఉన్నా కూడా రెవెన్యూ అధికారులు ఇప్పటికీ ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ కులాల పేరిట సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. షెడ్యూల్డ్ కు లాల జాబితాలోని అనేక కులాల వాళ్లకు ధ్రు వీకరణ పత్రాలను కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది.
బీసీ ఏ గ్రూపు కింద 68, బీసీ ‘బీ’ గ్రూపు కింద 28, బీసీ ‘సీ’ గ్రూపు కింద క్రైస్తవం స్వీకరించిన దళితులను, బీసీ ‘డీ’ గ్రూపు కింద 51, బీసీ ‘ఈ’ గ్రూపు కింద 14 కులాలను గుర్తించింది. అటు తరువాత బీసీలకు సంబంధించి 23కులాలను ఆ జాబితా నుంచి తొలగించింది. ఏపీ నుంచి వలసవచ్చిన బీసీ కులాలకు చెందిన ప్రజలు ఇక్కడ చెల్లుబాటయ్యే కులాల పేరిట ధ్రువీకరణ ప త్రాలను పొందారు. ఈ సర్వేలో కూడా అదేవిధంగా నమోదు చేసుకునే అవకాశముందని ఎంబీసీ వర్గాలు వివరిస్తున్నాయి. సంచారజాతుల ప్రజలకు ఇండ్లు కూడా లేవని, ఇవి ఎ లా నమోదు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.