హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను https://www.tspsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ‘కీ’ పై అభ్యంతరాలను 28 నుంచి జూలై 1 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామని చెప్పారు. రెస్పాన్స్ షీట్లు జూలై 26కు వెబ్సైట్లో ఉంటాయని పేర్కొన్నారు. అభ్యంతరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పీడీఎఫ్ ఫార్మట్లో నమోదు చేయాలని అనితా రామచంద్రన్ సూచించారు. రాష్ట్రంలో 22 హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ పరీక్షను ఈ నెల 17న టీఎస్పీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే.