ఇబ్రహీంపట్నం, మార్చి 13 : కులమతలాకతీతంగా చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహంగా (Holi Celebrations) జరుపుకుంటున్నారు. హోలీని రంగుల పండుగ లేదా కాముని పండుగగా పిలుస్తారు. కొంతమంది గిరిజనులు ఈ పండుగ సందర్భంగా వారంరోజుల ముందు నుంచే దుకాణాలు, తెలిసిన వారిని డబ్బులు అడుగుతుంటారు. హోళి రోజున నీటిలో రంగులు కలిపి ఒకరిపై ఒకరు చల్లుకుని సరదాగా గడుపుతారు. హోలీ పండుగకు ముందురోజు గ్రామంలోని నడిబొడ్డున కట్టెలు, పిడకలు ఒకదగ్గర చేర్చి కాముని కాల్చుతూ, యువకులు సంతోషంగా గడుపుతారు. కులమతాలకతీతంగా జరుపుకునే ఈ పండుగపూట రసాయన రంగులు వాడి చర్మానికి రోగాలు కొనితెచ్చుకోకుండా సహజసిద్దంగా లభించే మందులను వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రంగులు చల్లుకునే సమయంలో కండ్లు, ముక్కులు, నోట్లోకి వెల్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
సహజరంగుల తయారీ విధానం..
సహజరంగులతో ఉపయోగాలు..
పసుపుతో చేసిన రంగులు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తులసి ఆకులతో చేసిన రంగులు మానసికోల్లాసానికి తోడ్పడతాయి. శ్వాసక్రియ శక్తిని పెంచుతాయి. కలబంధ, వేపాకుల చర్మ వ్యాధులను తగ్గిస్తాయి. దురదల నివారణకు ఉపయోగపడతాయి. గోరింటాకు శరీర పగుళ్లను నివారిస్తుంది. గంధంపొడి మనసుకు ప్రశాంతత కలిగించడంతో పాటు సువాసన వెదజల్లుతుంది.
రసాయన రంగులతో చర్మ వ్యాధులు..
వసంతకాలం వాతావరణంలో చోటుచేసుకునే మార్పులతో వ్యాధులు ప్రభలుతాయి. ఈ సమయంలో సమజసిద్దమైన రంగులు శరీరానికి ఔషదంలా పనిచేస్తాయి. పూర్వం న్మి, కుంకుమపువ్వు, పసుపు, బల్వాలతో సహజ రంగులను తయారుచేసి మోలీ ఆడేవారు. కాలక్రమేనా రసాయనాలతో తయారుచేసిన రంగుల వాడకం పెరిగి సహజ రంగుల వాడకం తగ్గింది. రసాయన రంగులతో ఈ పండుగ ఎంత ఉల్లాసాన్ని నింపుతుందో…అంతే విషాదాన్ని మిగుల్చుతుంది. రంగుల్లో వాడే రసాయన పదార్థాలతో శరీరానికి హాని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కళ్లమంటలు, ఆస్తమా, చర్మ వ్యాధులు సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నలుపు రంగులో లెడ్ ఆక్సైడ్ ఉంటుందని, ఇది మూత్రపిండాలను పాడు చేస్తుందని, వెండి రంగులో ఉండే మెర్క్యురీ సల్ఫేట్తో ఆక్యన్సర్ సోకే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఆకుపచ్చ రంగుల్లో ఉండే కాపర్ సల్ఫేట్ ద్వారా ఎలర్జీతో పాటు శాశ్వత అంధత్వం వచ్చే అవకాశం ఉంది. పొడిగా ఉండే రంగుల్లో జిలెటిన్పైలట్ కలవడం వల్ల మైకంతో పాటు ఆస్తమా, అంధత్వం వచ్చే అవకావం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. అందువల్ల హోలీ పండుగలో రసాయన రంగులకు బదులు సహజ రంగులు వాడటం ఎంతో శ్రేయస్కరం.
తీసుకోవల్సిన జాగ్రత్తలు..