యాదాద్రి భువనగిరి, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో హెచ్ఎంపీవీ తొలి పరీక్షా కేంద్రాన్ని యాదా ద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో శుక్రవారం ప్రారంభించా రు. దీనికి సంబంధించి ఈ నెల 9న మంజూరు ఉత్తర్వులు రాగా పరీక్షా కిట్లు, ఇతర సామగ్రి సిద్ధంగా ఉంచారు.
ఇన్ఫ్లూయంజా, ఆర్ఎస్వీ(రెస్పిరేటరీ సింక్రిటియల్ వైరస్), సార్స్ కోవ్-2 పరీక్షల్లో నెగెటివ్ వస్తేనే హెచ్ఎంపీవీ పరీక్ష చేస్తారు. వివిధ ప్రాం తాల్లో అనుమానాలు ఉన్న నమూనాలను ఎయిమ్స్‌కు తీసుకువచ్చి, ఇక్కడ పరీక్షల తర్వాత పాజిటివ్‌గా తేలితే ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారు.