పాలకుర్తి రూరల్, ఫిబ్రవరి 23: జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూరు గ్రామంలో కాకతీయుల కాలం నాటి రుద్రమదేవి శిలాశాసనం ఉన్నట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు. శ్రీరమా సత్యనారాయణస్వామి ఆలయం ఎదుట గురువారం ఆయన ఈ శాసనాన్ని గుర్తించారు.
ఈ శాసనాన్ని సామాన్య సంవత్సరం 1280 అక్టోబర్ 11న వేశారని, ఇది సుమారు 5 అడుగుల ఎత్తు, 11అడుగుల వెడల్పు గల శిలా స్తంభంపై నలువైపులా తొలచబడి ఉన్నదన్నారు. ఇది మొత్తం 78 పంక్తులతో ఉన్నదని, మొదట, చివర సంస్కృత భాషలో ఉండగా, మిగిలిన దంతము తెలుగులో రచించినట్టు ఆయన వెల్లడించారు.