హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ): ఉన్నత విద్యను అభ్యసించేందుకు మన రాష్ర్టానికి వచ్చే విదేశీ, దేశంలోని ఇతర రాష్ర్టాల విద్యార్థుల సౌకర్యార్థం రాష్ట్ర ఉన్నత విద్యామండలి తన అధికారిక వెబ్సైట్ www.tsche.ac.in ను అధునాతనంగా తీర్చిదిద్దింది. మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యావకాశాలు, వసతులు తదితర విషయాలకు సంబంధించిన సమాచారాన్ని 18 విదేశీ, 9 స్వదేశీ భాషల్లో పొందుపరిచారు. ఉన్నత విద్యామండలి రూపొందించిన వెబ్‌సైట్‌ను విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇండోనేషియన్, డచ్, అరబిక్, చైనీస్, రష్యన్, ఐరిష్, పర్షియన్, నేపాలీ, మంగోలియన్, థాయ్, లాటిన్, జపనీస్, ఇటాలియన్, హంగేరియన్ తదితర విదేశీ భాషలతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, ఉర్దూ, తమిళ్, సంస్కృతం, మరా ఠి, కన్నడ, గుజరాతీ భాషల్లోనూ సమాచారం లభిస్తుంది. ట్విన్నింగ్, జాయింట్ డిగ్రీల కోసం మన దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులకు ఈ వెబ్సైట్ ఉపయుక్తంగా ఉంటుందని వెబ్ డిజైన్ రూపకర్తల్లో ఒకరైన ప్రొఫెసర్ పీ నవీన్‌కుమార్ తెలిపారు.