కోర్టులకు ఇచ్చే గౌరవం ఇదేనా?
కోర్టు ధికరణ కేసులో నోటీసులు జారీ చేసినప్పటికీ హాజరుకాకపోవడంపై రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితారాణా తీరును హైకోర్టు తప్పుపట్టింది. కోర్టులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించింది.
- ఐఏఎస్ అధికారి యోగితారాణాపై హైకోర్టు తీవ్ర మండిపాటు
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): కోర్టు ధికరణ కేసులో నోటీసులు జారీ చేసినప్పటికీ హాజరుకాకపోవడంపై రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితారాణా తీరును హైకోర్టు తప్పుపట్టింది. కోర్టులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇలా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. కారుణ్య నియామకానికి సం బంధించి 2023లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మహబూబ్ దాఖలు చేసిన కోర్టుధికరణ పిటిషన్‌ను జస్టిస్ టీ మాధవీదేవి గురువారం విచారించారు.
కోర్టు ఆదేశాల తర్వాత సైతం యో గితారాణా విచారణకు హాజరుకాలేదు. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. దీం తో న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మధ్యాహ్నంలోగా విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చిచెప్పారు. నిజామాబాద్‌లో ఉన్న యోగితారాణా మధ్యాహ్నం ఆన్లైన్లో విచారణకు హాజరై బేషరతుగా క్షమాపణలు చెప్పారు. హైకోర్టు గత ఆదేశాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌కు సూచనలు ఇచ్చామని తెలిపారు. స్పందించిన న్యాయమూర్తి, ఈ వ్యవహారం మీ దగ్గర పెండింగ్‌లో ఉందని కలెక్టర్ చెప్తున్నారని అన్నారు. కోర్టుధికరణ పిటిషన్లో కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

