హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న హెచ్చరించారు. శనివారం ఉత్తర- దక్షిణ ద్రోణి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్టల్ ఏపీ, తమిళనాడు మీదుగా సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ కొనసాగుతున్నదని వివరించారు.
ఆదివారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి , రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించారు.