Srisailam Dam | శ్రీశైలానికి భారీగా 4.40 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం
Srisailam Dam | ఎగువన భాగాల నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో జూరాల, సుంకేశుల నుంచి అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు.
నాగర్ కర్నూల్ : ఎగువన భాగాల నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో జూరాల, సుంకేశుల నుంచి అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో ఈ రెండు ప్రాజెక్టుల నుంచి వస్తున్న భారీ వరద నీరు శ్రీశైలం జలాశయానికి ( Srisailam Dam) వచ్చి చేరుతుంది.
సుంకేశుల (Sukensula) నుంచి 1.40 లక్షల క్యూసెక్కులు, జూరాల (Jurala Project) నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో శ్రీశైలానికి సుమారు 4.40 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం డ్యామ్ అధికారులు ఎడమ, కుడిగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి 60,977 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 872.60 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. మరో 13 అడుగుల నీటి మట్టం పెరిగితే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. నిర్దేశించిన స్థాయి వరకు నీటి మట్టం పెరిగితే ఒకటి, రెండురోజుల్లో శ్రీశైలం గేట్లు తెరిచేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.
Read more :
Bhadrachalam | భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి ఉధృతి.. మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

