ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు
ఆహార కల్తీపై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. ఫుడ్ సేఫ్టీ విభాగం పనితీరు మెరుగుపడాలని, కల్తీకి పాల్పడేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
- ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల పనితీరు మరింత మెరుగుపడాలి
- అధికారులు లేని జిల్లాల్లో డీఎంహెచ్‌వోలకు బాధ్యత
- త్వరలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం
- రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఆహార కల్తీపై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. ఫుడ్ సేఫ్టీ విభాగం పనితీరు మెరుగుపడాలని, కల్తీకి పాల్పడేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐపీఎం, ఫుడ్ సేఫ్టీ విభాగం, ల్యాబ్స్ పనితీరు, సాధించిన పురోగతిపై శుక్రవారం హైదరాబాద్‌లోని వెంగళ్రావునగర్లో ఉన్న ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నదని, ఫుడ్ సేఫ్టీ విషయంలోనూ దేశానికి ఆదర్శంగా నిలువాలని ఆకాంక్షించారు. అధికారులు లేని చోట ఫుడ్ సేఫ్టీ బాధ్యతలను డీఎంహెచ్‌వోలకు అప్పగించాలని ఆదేశించారు. వారికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఖాళీగా ఉన్న పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నెలలో రెండు శనివారాల్లో లైసెన్సింగ్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని సూచించారు.
ప్రజల్లో అవగాహన పెంచాలి
కల్తీ చేసేవారిపై చర్యలు తీసుకుంటూనే ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. కల్తీ ఆహారం మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాల అనారోగ్య సమస్యలు, జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఎకడైనా కల్తీ జరిగినట్టు, నాణ్యత లేనట్టు సమాచారం ఉంటే 040-21111111 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా ‘@AFCGHMC’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదులు అందగానే అధికారులు వెళ్లి చర్యలు తీసుకొంటారని చెప్పారు. టాస్‌ఫోర్స్ బృందాలు జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. అన్ని మొబైల్ ల్యాబొరేటరీ వాహనాలు పని చేయాలని సూచించారు. కోర్టు కేసులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని, త్వరగా పరిషారమయ్యేలా చొరవ చూపి కల్తీ చేసే వారి ఆట కట్టించాలన్నారు. సమీక్షలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మొహంతి, ఐపీఎం, ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ శివలీల, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, అన్ని జిల్లాల ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.
ఆహార కల్తీపై ఫిర్యాదులకు
టోల్ ఫ్రీ నంబర్: 040- 21111111
ట్విట్టర్ హ్యాండిల్: @AFCGHMC
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

