ఇకపై ప్రభుత్వ దవాఖానల్లోనూ గుండె జబ్బులకు వైద్యం
మంత్రి జగదీష్ రెడ్డి | ఇకపై గుండె జబ్బులకూ ప్రభుత్వ దవాఖానలో వైద్యం అందించనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

నల్లగొండ : ఇకపై గుండె జబ్బులకూ ప్రభుత్వ దవాఖానలో వైద్యం అందించనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణా డయాగ్నాస్టిక్ సెంటర్, మొబైల్ క్రిటికల్ కేర్ అంబులెన్స్ తో పాటు అక్షిజన్ ప్లాంట్లను మంత్రి నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ దవాఖానల్లో గుండె జబ్బులకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు నిర్వహించ నున్నట్లు ఆయన ప్రకటించారు.
అందుకు సంబంధించిన సిబ్బంది నియామకాలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు.
క్యాన్సర్ మహమ్మారిని నిలువరించేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలను సిద్ధం చేశారని ఆయన చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ దవాఖానలలో నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.
ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెరిగిందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కే. వి.రామారావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఎంహెచ్వో కొండల్ రావు, దవాఖాన సూపరింటెండెంట్ జైసింగ్ రాథోడ్, డీసీహెచ్ డాక్టర్ మాతృ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అందరికి హెల్త్ ప్రొఫైల్.. అదే సీఎం కేసీఆర్ లక్ష్యం
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ వైద్య రంగంలో మరో మందడుగు : మంత్రి పువ్వాడ
తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సబితా రెడ్డి
రేపు ఆకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం
వైద్య ఆరోగ్య శాఖ మరింత బలోపేతం : మంత్రి నిరంజన్ రెడ్డి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

