అందరికి హెల్త్ ప్రొఫైల్.. అదే సీఎం కేసీఆర్ లక్ష్యం
మంత్రి సత్యవతి రాథోడ్ | సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య రంగం బలోపేతమవుతున్నది.

ములుగు : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య రంగం బలోపేతమవుతున్నది. ఇది పేద ప్రజలకు వరంగా మారబోతున్నదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు ఏరియా హాస్పిటల్ లో ఏర్పాటుచేసిన టి – డయాగ్నస్టిక్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో నేడు 19 డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవడం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు.
బడ్జెట్లో కేటాయించిన దానికి అదనంగా పది వేల కోట్ల రూపాయలను ఆరోగ్య రంగంలో ఖర్చు పెట్టడంతో వైద్య రంగం దశ మారనుందన్నారు. జిల్లాలో టి- డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించుకోడం సంతోషంగా ఉందన్నారు. ఈ సెంటర్ లో 57 రకాల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తారన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య పరీక్షలు ఉచితంగా చేసుకునే అవకాశం కల్పించిన సీఎం కేసిఆర్ గారికి ధన్యవాదాలు. రాష్ట్రంలో అందరికీ హెల్త్ ప్రొఫైల్ ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు.
ప్రమాదం జరిగినపుడు అత్యవసర సమయంలో మొదటి గంట సరైన వైద్యం అందించేందుకు చాలా ముఖ్యమైంది. ఆ సమయంలో వివిధ వైద్య పరీక్షలు నిర్వహించడంతో సమయం వృథా అవుతుందని, హెల్త్ ప్రొఫైల్ ఉంటే సరైన సమయంలో సరైన వైద్యం అందించే అవకాశం ఉంటుందన్నారు.
ఈ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడానికి సిరిసిల్లతో పాటు ములుగు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందుకు ఈ జిల్లా ఇంచార్జి మంత్రిగా, గిరిజన బిడ్డగా సీఎం కృతజ్ఞతలని తెలిపారు.
త్వరలో గుండె సంబంధ అన్ని పరీక్షలు కూడా ఈ టి – డయాగ్నస్టిక్ సెంటర్ లో చేసుకునే అవకాశం వస్తుందన్నారు.
కరోనాను పూర్తిగా కట్టడి చేయడంలో అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, పీఓ హన్మంతు జేండగే తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ వైద్య రంగంలో మరో మందడుగు : మంత్రి పువ్వాడ
తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి సబితా రెడ్డి
రేపు ఆకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం
వైద్య ఆరోగ్య శాఖ మరింత బలోపేతం : మంత్రి నిరంజన్ రెడ్డి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

