కొల్చారం, డిసెంబర్ 29 : వ్యక్తిగత కారణాలతో ఓ హెడ్‌కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో ఆదివారం కలకలం రేపింది. కొల్చారం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సాయికుమార్‌ది ఏపీలోని గుంటూరు జిల్లా. 1992లో ఉద్యోగం పొంది నర్సాపూర్‌లో స్థిరనివాసం ఏర్పర్చుకున్నాడు. నర్సాపూర్, కౌడిపల్లి స్టేషన్లలో పనిచేసి ఏడాది క్రితం పదోన్నతిపై కొల్చారం స్టేషన్‌కు హెడ్‌కానిస్టేబుల్‌గా వచ్చాడు. ఈయనకు భార్యతోపాటు వివాహమైన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో బాధపడుతున్న ఈయన ఆదివారం తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ ఆవరణలోని పాత ఎస్సై క్వార్టర్స్ ఎదుట చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.