జియోడెసీ, జియోడైనమిక్స్ ఎడిటోరియల్ బోర్డు సభ్యునిగా చక్రవర్తి
కొండాపూర్, ఫిబ్రవరి 16: గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ప్రొఫెసర్‌కు అరుదైన అవకాశం లభించింది. వర్సిటీలోని సెంటర్ ఫర్ ఎర్త్, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వీ చక్రవర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మాలజీ, చైనా ఎర్త్‌క్వేక్ అడ్మినిస్ట్రేషన్, సైన్స్ ప్రెస్‌తోపాటు 6 ఇతర అంతర్జాతీయ ఏజెన్సీల సంయుక్త ఎడిటోరియల్ బోర్డు ‘జియోడెసీ, జియోడైనమిక్స్’లో సభ్యునిగా నియమితులైనట్టు వర్సిటీ యాజమాన్యం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. జియోఫిజికల్ పరిశోధనల్లో ప్రొఫెసర్ చక్రవర్తి కనబరిచిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఈ నియామకం జరిపినట్టు తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈసీ మెంబర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫసర్ చక్రవర్తి ఇప్పటికే సీఎస్ఐఆర్ యంగ్ సైంటిస్ట్ అవార్డుతోపాటు నేషనల్ మినరల్ అవార్డును, ఇండియన్ జియోఫిజికల్ యూనియన్ గోల్డ్ మెడల్‌ను అందుకొన్నారు.