Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ప్రజలు, ఉద్యోగులు మీ ఉద్యోగాలు ఊడగోడుతారు చూస్కో రేవంత్ అని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావుఫైర్ అయ్యారు.
హైదరాబాద్ : ప్రజలు, ఉద్యోగులు మీ ఉద్యోగాలు ఊడగోడుతారు చూస్కో రేవంత్ అని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావుఫైర్ అయ్యారు. విద్యుత్ సంక్షోభానికి మీ చేతగానితనమే కారణం అని వారి ఉద్యోగాలు పోతాయని సీఎం మాట్లాడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు మీరు చేసి, అధికారుల మీద నెపం నెట్టడం సీఎం, మంత్రులకు పరిపాటిగా మారిందని విమర్శించారు. బొగ్గు నిల్వలు కూడా పెట్టుకోకుండా విద్యుత్ సంక్షోభానికి కారణమైంది మీరు కాదా? అని ప్రశ్నించారు. సమీక్షలు కూడా చేయకుండా, విద్యుత్ రంగాన్ని గాలికి వదిలేసి, కరెంట్ కోతలకు కారణం అయ్యింది మీరేనని గుర్తు చేశారు. ఇప్పుడు నింద మొత్తం అధికారుల మీద వేసి, మీరు సుద్ధపూసలా మాట్లాడుతారా? అని మండిపడ్డారు.
9 నెలలుగా ఎల్నినో ప్రభావం గురించి వాతావరణ శాఖ, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే వచ్చారు. కానీ మీరు మాత్రం మొద్దు నిద్రలో ఉన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. ఇప్పుడు నిద్ర లేచి అధికారులను సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారు. నిషేధిత భూముల జాబితాలో తప్పు చేసింది మీ ప్రభుత్వమే. కానీ అధికారుల మీద నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. ఇప్పుడు కరెంట్ సంక్షోభం విషయంలోనూ మా తప్పేం లేదు, అంతా అధికారులదే అన్నట్లు మాట్లాడుతున్నారు. ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తు అంటున్నారు. ఈ రెండింటికంటే మించిన విపత్తు మీ పాలన అని ఎందుకు గుర్తించడం లేదు? అధికారుల ఉద్యోగాలు ఊడతాయని హెచ్చరిస్తున్నావు.. ప్రజలు, అధికారులు నీ ఉద్యోగం ఊడగొట్టకుండా చూసుకో రేవంత్ అని హితవు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

