కాంగ్రెస్ పాలనలో చస్తేనే బిల్లులా.. లక్ష కోట్ల అప్పుల్లో సివిల్ సప్లయీస్
‘బిల్లుల కోసం నేను చనిపోవడానికీ సిద్ధం అని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అంటుంటే, సమస్యల పరిషారం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజు అంటున్నారు.. కాంగ్రెస్ రాజ్యంలో చచ్చిపోతేనే బిల్లులు వస్తాయా?
- రూ.600 కోట్ల బియ్యాన్ని పందికొకుల పాల్జేసిండ్రు
- ప్రజా ప్రభుత్వమంటూ సీఎం గొప్పలు
- అధ్వానంగా ఉత్తమ్‌రెడ్డి శాఖ పనితీరు
- రేషన్ డీలర్లను చర్చలకు పిలువాలి
- గజ్వేల్‌లో రేషన్ డీలర్ల రాష్ట్రస్థాయి సమావేశంలో హరీశ్‌రావు
సిద్దిపేట, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘బిల్లుల కోసం నేను చనిపోవడానికీ సిద్ధం అని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అంటుంటే, సమస్యల పరిషారం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజు అంటున్నారు.. కాంగ్రెస్ రాజ్యంలో చచ్చిపోతేనే బిల్లులు వస్తాయా? రేవంత్‌రెడ్డి తప్పుడు నిర్ణయాలతో సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ రూ.లక్ష కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. 16 నెలలుగా గోదాములు, షాపుల్లో మూలుగుతున్న రూ.600 కోట్ల విలువైన దొడ్డు బియ్యాన్ని పురుగులు, పందికొకుల పాల్జేసిండ్రు’ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు ప్రభుత్వంపై ఫైర్ అయ్యా రు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌లోని బింగి ఎల్లయ్య గార్డెన్స్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి రేషన్ డీలర్ల సమావేశానికి హరీశ్‌రావు హాజరయ్యారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి తరలివచ్చిన రేషన్ డీలర్లు ఎదురొంటున్న సమస్యలపై ఈ సమావేశంలోచర్చించారు.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. రూ.100 కోట్లతో సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి, రూ.18 కోట్లతో ప్రహరీ కట్టడానికి, అందాల పోటీలకు, ఫుట్‌బాల్ షోలకు డబ్బులుంటాయి.. కానీ, 17,200 మంది రేషన్ డీలర్లకు నెలకు రూ.10 కోట్ల గౌరవ వేతనం ఇవ్వడానికి పైసలు లేవా? అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల ముందు రూ.5 వేల గౌరవ వేతనం, రూ.300 కమీషన్, మినీ సూపర్ మారెట్లు ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకుని.. మూడేండ్లు అవుతున్నా కనీసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తక్షణమే డీలర్ల సంఘాన్ని చర్చలకు పిలిచి హామీలు నెరవేర్చకపోతే అసెంబ్లీ, కౌన్సిల్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. తమ సమస్యలు పరిషారం కాకపోతే ఆమరణ దీక్ష చేస్తామని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు అనడం తనను కదిలించిందని అన్నారు.
నిన్ననే జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కూడా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ‘మంత్రుల నియోజకవర్గాలకే నిధులు పోతున్నాయి. జడ్చర్లలో రోడ్లు పగుళ్లు పడ్డా దా దాపు రూ.40 కోట్ల బిల్లులు కూడా రావడం లేదు. ఒక కాంట్రాక్టర్ చనిపోతే రూ.5 కోట్ల బిల్లు పడింది. నేను చనిపోతేనే మా నియోజకవర్గ బిల్లులు వస్తాయంటే.. ప్రాణత్యాగానికి సిద్ధం’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారని హరీశ్‌రావు గుర్తుచేశారు. అసలు రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే.. చనిపోతేనే పనులు అవుతాయా? చచ్చిపోతేనే బిల్లులు వస్తాయా? అధికార పార్టీ ఎమ్మెల్యేనే చచ్చిపోవడానికి సిద్ధమనే దుస్థితి వచ్చిందని అన్నారు.
ఇదేం ప్రజాపాలన?
ప్రజలను ఎప్పుడైనా కలిసేదే ప్రజా ప్రభుత్వం కదా! మరి 17,200 మంది రేషన్ డీలర్లు ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షుడికే మూడేండ్లలో అపాయింట్మెంట్ దొరక్కపోతే ఇదెకడి ప్రజాపాలన? అని హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. గోదాములు, ఎంఎల్ఎస్ పాయింట్లలో లక్ష టన్నులు, రేషన్ షాపుల్లో 40 నుంచి 50 వేల టన్నుల దొడ్డు బియ్యం మూలుగుతున్నదని దుయ్యబట్టారు. ఆ బియ్యాన్ని అమ్మితే వచ్చే రూ. 600 కోట్లతోనే డీలర్ల కమీషన్ పెంపు, గౌరవ వేతనం ఇచ్చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, ప్రధాన కార్యదర్శులు శ్రీ కాంత్, ధరావత్ మోహన్ నాయక్, అజీజ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

