సంక్షోభంలో సంక్షేమ హాస్టళ్లు
కేసీఆర్ పాలనలో క్షేమంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లు, నేడు సంక్షోభంలో పడ్డాయని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన హాస్టల్స్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ దుస్థితి ఎలా ఉందో నేడు అదే పరిస్థితి పునరావృతం అయిందని విమర్శించారు. విద్యార్థులకు యూనిఫామ్ అందని పరిస్థితి ఉందని ,10వ తరగతి విద్యార్థుల ట్యూటర్స్‌కు 15 నెలల నుండి జీతాల్లేవని,. 6నెలలుగా నిత్యావసర సరుకుల సరఫరా లేదని చెప్పారు.
- సమైక్యనాటి పరిస్థితి పునరావృతం
- 15 నెలల నుంచి ట్యూటర్స్‌కి జీతాల్లేవు
- 6 నెలలుగా నిత్యావసరాల సరఫరా లేదు
- సిద్దిపేటలో హాస్టల్స్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో హరీశ్‌రావు
సిద్దిపేట, అక్టోబర్ 28: కేసీఆర్ పాలనలో క్షేమంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లు, నేడు సంక్షోభంలో పడ్డాయని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన హాస్టల్స్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ దుస్థితి ఎలా ఉందో నేడు అదే పరిస్థితి పునరావృతం అయిందని విమర్శించారు. విద్యార్థులకు యూనిఫామ్ అందని పరిస్థితి ఉందని ,10వ తరగతి విద్యార్థుల ట్యూటర్స్‌కు 15 నెలల నుండి జీతాల్లేవని,. 6నెలలుగా నిత్యావసర సరుకుల సరఫరా లేదని చెప్పారు.
నిత్యావసరాలకు వార్డెన్ అప్పులు తెచ్చి కడుతున్నారని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మూడు మండలాల్లో బ్రేక్ ఫాస్ట్ పథకం ఎలా వస్తుంది?. సిద్దిపేట నియోజకవర్గంలోని ఎందుకురాదు అని ప్రశ్నించారు. వెంటనే సిద్దిపేట జిల్లాలో పూర్తి స్థాయిలో బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సాలర్షిప్లకు విద్యార్థుల్లో దరఖాస్తు చేసుకునేలా చొరవ చూపాలన్నారు. కార్యక్రమం లో సోషల్వెల్ఫేర్ జిల్లా అధికారులు, నోడల్ ఆఫీసర్స్, హాస్టల్స్ వార్డెన్స్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

