హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) కన్నుమూశారు. గత మూడురోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.45 గంటలకు గచ్చిబౌలిలోని దవాఖానలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని మాదాపూర్లోని తన నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గోపీనాథ్ పార్థీవదేహానికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హరీశ్ రావు (Harish Rao), ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పువ్వాడ అజయ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పలువురు నాయకులు నివాళులు అర్పించారు.