హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్పై రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీబీ లింక్‌పై ఉత్తరాలు రాస్తే ముందే ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. మంత్రి వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా హరీశ్‌రావు మండిపడ్డారు. తాను పత్రికా సమావే శం పెట్టిన తర్వాతనైనా మేలొని 22వ తేదీతో లెటర్ రాసి, ఈరోజు విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
22నే నిజంగా లేఖ రాసి ఉంటే, ఆ రోజే మీడియాకు విడుద ల చేయకుండా ఈరోజు వరకు ఎందుకు దా చిపెట్టారని నిలదీశారు. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం విషయంలో ఏపీ సీఎం 2024 నవంబర్ 15న ఒక లేఖ, నిధుల కోసం 2024 డిసెంబర్ 31న మరో లేఖ రాశారని, మరి ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని, ఉత్తరాలు ఎందుకు రాయలేదని, 22నే ఉత్తరాలు రాస్తే ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు.
జీబీ లింక్ ప్రాజెక్టుపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని అభ్యంతరం తెలిపారు. 200 టీఎంసీలు తీసుకుపోతున్నారని తాను ఎకడ అనలేదని, జలాలను తరలించుకుపోయేందుకు ప్రాజెక్టు రూపకల్పన చేస్తుంటే ప్రభుత్వం మౌనం వహిసున్నదని మాత్రమే ప్రశ్నించానని వివరించారు. తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం తాను ప్రశ్నిస్తే గాని, ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని చురకలంటించారు. 512: 299 నిష్పత్తిలో ఒప్పందం ఒకే ఏడాదికి జరిగిన విషయం మంత్రి విడుదల చేసిన డాక్యుమెంట్లలోనే స్పష్టంగా ఉందని, మంత్రి హోదాలో ఉండి ఎందుకు అబద్ధాలు చెబుతున్నారని నిప్పులు చెరిగారు. ఒకవేళ అదే ఒప్పందం ఉంటే, సెక్షన్ 3 ప్రకారం.. నీటి పంపకాలు అంశం ఎందుకు ఉత్పన్నమైందని ప్రశ్నించారు.
ట్రిబ్యునల్ సమావేశానికి మంత్రి హోదాలో హాజరైన మొదటి వ్యక్తి తానొక్కడినేనని ఉత్తమ్ మరో అబద్ధం చెబుతున్నారని, 2016లోనే సీఎం హోదాలో కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా తాను ట్రిబ్యునల్ మీటింగ్‌లో పాల్గొని తెలంగాణ పక్షాన కొట్లాడామని, మీటింగ్ మినిట్స్‌లో ఆ వివరాలు ఉంటాయని, వాటిని చూసుకోవాలని చురకలంటించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనూ మంత్రి ఉత్తమ్ అబద్ధాలు చెప్పారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు ను వ్యతిరేకించలేదనేది పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచే వ్యతిరేకిస్తూ కేఆర్ఎంబీకి, కేంద్రానికి, జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌కు పుంఖానుపుంఖాలుగా లేఖలు రాశామని గుర్తుచేశారు.
తమ ఒత్తిడితోనే ప్రాజెక్టు పనులు చేయవద్దని జల్‌శక్తి మంత్రి కూడా ఏపీకి లేఖ రాశారని, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎన్జీటీకి వెళ్లి స్టే తీసుకొచ్చిందని, సెకండ్ అపె క్స్ కౌన్సిల్లో కూడా వ్యతిరేకంగా మాట్లాడామని, మీటింగ్ మినిట్స్‌లో అవికూడా ఉంటాయని చూసుకోవాలని మంత్రికి సూచించా రు. ఇప్పటికీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగి ఉన్నాయంటే అది బీఆర్ఎస్ చేసిన కృషి వల్లనే అన్నది దాచేస్తే దాగని సత్యమని తెలిపారు. తాను మాట్లాడింది గోదావరి జలాల్లో జరుగుతున్న అన్యాయం గురించైతే, మంత్రి ఆ విషయం మాట్లాడకుండా ఏవేవో మాట్లాడి, విషయాన్ని పక్కదోవపట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. మంత్రి చెప్పిన అబద్ధాలకు పూర్తి వాస్తవాలతో పత్రికా సమావేశం నిర్వహించి అసత్య ప్రచారాన్ని పటాపంచలు చేస్తానని ఎక్స్ వేదికగా హరీశ్ వెల్లడించారు.
హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి-బనకచర్ల ప్రా జెక్టుపై తమ ప్రభుత్వం అలర్ట్‌గానే ఉన్నదని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నా రు. ఏపీ ప్రతిపాదిత ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి అభ్యంతరాలను తెలియజేసిందని, లేఖలు కూడా రాశామని వెల్లడించా రు. సచివాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మంత్రి మా ట్లాడారు. మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలను ఖండించారు. గోదావరి-బనకచర్ల అనుసంధాన పథకానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి ప్రతిపాదనలు మాత్రమే సమర్పించారని స్పష్టం చేశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ, ఆర్థికశాఖ మంత్రులకు రాసిన లేఖలను ఈ సందర్భంగా మీడియాకు మంత్రి ఉత్తమ్ విడుదల చేశారు.