Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Harish Rao | 3 వేల కుటుంబాలు రైతు బీమా అందకపోవడంతో నేడు రోడ్డుమీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సూచించారు.
Harish Rao | ఒక్క సిద్ధిపేట నియోజకవర్గంలోనే 22 మంది రైతులు చనిపోయారు.. ఆగస్టు 15 నుండి ఇప్పటి వరకు 22 మంది రైతులు చనిపోయారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు.
ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 3000 మంది రైతులు చనిపోయారని సమాచారముంది. ఈ 3 వేల కుటుంబాలు రైతు బీమా అందకపోవడంతో నేడు రోడ్డుమీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్షణమే ప్రభుత్వం మేల్కోవాలని సూచించారు.. ఈ 3 వేల కుటుంబాలకు కూడా రైతు బీమా డబ్బులు వెంటనే చెల్లించి ఆయా కుటుంబాలను ఆదుకోవాలని ఒక వేళ ప్రభుత్వం దిగి రాకపోతే.. ఈ రైతు కుటుంబాలను తీసుకొచ్చి నీ ఇంటి ముందు ధర్నా చేయాల్సి వస్తదని, సెక్రటేరియట్‌ను ముట్టడించాల్సి వస్తదని సీఎం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంతదూరం తెచ్చుకోకు. ఈ డబ్బులు వెంటనే ఇచ్చి రైతు బీమా పథకాన్ని కొనసాగించి ఆ కుటుంబాలను ఆదుకోండి.. లేదంటే ఈ కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చి నీ ఇల్లు ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా అని హరీశ్ రావు అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్రవ్యాప్తంగా రైతు బీమా పథకానికి దూరమైన 3 వేల మంది కుటుంబాలను ఆదుకోవాలని.. అందరికీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించి తక్షణమే ఎల్ఐసీకి ప్రీమియం కట్టి రైతు బీమా పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
రైతు బీమా ఇవ్వకుంటే బాధిత కుటుంబాలతో కలిసి రేవంత్ రెడ్డి ఇంటిని, సెక్రటేరియట్‌ను ముట్టడిస్తాం
ఆగస్టు 15 నుండి ఇప్పటి వరకు ఒక్క సిద్ధిపేట నియోజకవర్గంలోనే 22 మంది రైతులు చనిపోయారు
రాష్ట్రవ్యాప్తంగా 3000 మంది రైతులు చనిపోయారు.. వీరి కుటుంబాలకు ఇప్పటివరకూ రైతు బీమా అందలేదు
తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ బాధిత కుటుంబాలకు రైతు బీమా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
– హరీష్ రావు
— Telugu Scribe (@TeluguScribe) October 15, 2026
Read Also :
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

