Harish Rao | కాంగ్రెస్ దుర్మార్గపు పాలన మీద కలమెత్తని కవి, గళమెత్తని గాయకుడు లేడు : హరీశ్‌రావు
Harish Rao | సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ అనుభవించిన కరువు బాధలను, నీళ్ల గోసలను, అంతులేని వివక్షను, అడ్డులేని దోపిడీని చూసి ఆగ్రహించి పాటరాయని కవి. గళమెత్తని గాయకుడు లేడు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Harish Rao | హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ అనుభవించిన కరువు బాధలను, నీళ్ల గోసలను, అంతులేని వివక్షను, అడ్డులేని దోపిడీని చూసి ఆగ్రహించి పాటరాయని కవి. గళమెత్తని గాయకుడు లేడు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు.
నీటిపారుదల శాఖపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా శాసనసభలో హరీశ్‌రావు మాట్లాడుతూ పలు పాటలను గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీటి గోస గురించి కవులు రాసిన పాటలను హరీశ్‌రావు సభ ముందుంచారు. ప్రజా యుద్ధనౌక గద్దర్, అందెశ్రీ, కవి జయరాజు రాసిన పాటలను గుర్తు చేశారు హరీశ్‌రావు.
కాంగ్రెస్ పాలనలోరన్నో మనకు కన్నీళ్లే మిగిలాయిరన్నో
గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది. కృష్ణమ్మ తల్లిరాకన్నీల్లు రాల్చింది.
సింగరేణి తల్లి సిన్నబోయినాది. సిక్స్ టెన్ జీవోనేమో జీరో అయ్యినాది.
అని కాంగ్రెస్ దుర్మార్గపు దాష్టికాల గురించి ప్రజా యుద్ధనౌక గద్దర్ రాసిన్రు అధ్యక్షా..
ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి
దక్సిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి
నీళ్లు లేక నోళ్లు తెరిచెబీళ్లను చూడు
మా పల్లెలన్నీ బోసిపోగ తల్లడిల్లుతున్న తల్లీ
చూడు తెలంగాణ, చుక్కలేని నీళ్లు లేని దాన
మా గోడు తెలంగాణ, బతుకు పాడైన దాన..
అనిఅందెశ్రీగారు కాంగ్రెస్ పాపిష్టి పరిపాలనను శపిస్తూ రాసినారు.
మరో కవి జయరాజు గారు…
వానమ్మవానమ్మఒక్కసారన్నవచ్చిపోవేవానమ్మ
చేలల్ల నీళ్లు లేవు, చెలకల్ల నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కండ్లల్ల నీళ్ళు లేవు.
అని హృదయం ద్రవించి పోయేలా రాసారు.
కాంగ్రెస్ దుర్మార్గపు పాలన మీద కలమెత్తని తెలంగాణ కవి లేడు, గళమెత్తని తెలంగాణ గాయకుడు లేడు. ఇట్ల చెప్పుకుంటు పోతే రేపటి దాక చెప్పొచ్చని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఆనాటి సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ అనుభవించిన కరువు బాధలను, నీళ్ల గోసలను, అంతులేని వివక్షను, అడ్డులేని దోపిడీని చూసి ఆగ్రహించి పాటరాయని కవి లేడు.. గళమెత్తని గాయకుడు లేడు.
– అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ @BRSHarish pic.twitter.com/vhWvFZLLlS
— BRS Party (@BRSparty) February 17, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

