హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ఛత్రపతి శివాజీ మహరాజ్ యువతరానికి స్ఫూర్తి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. శివాజీ జయంతి సందర్భంగా బుధవారం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎక్స్ వేదికగా హరీశ్‌రావు స్పందిస్తూ ‘విజనరీ లీడర్, భయమెరుగని గొప్ప యోధుడు.
ఛత్రపతి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకం. ప్రజల సంక్షేమానికి జీవితం అంకితం చేసిన గొప్ప రాజు’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా శివాజీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె ఎక్స్‌లో స్పందిస్తూ నిజమైన స్వరాజ్యానికి శివాజీ నిలువుటద్దమని తెలిపారు. ప్రజల హక్కుల కోసం నిబద్ధతతో పోరాడిన వ్యక్తి అని కొనియాడారు.