Telangana | హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : సీఎం తమ్ముడి పేరిట రెండు ప్రముఖ యాడ్ ఏజెన్సీల నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మిథున యాడ్ ఏజెన్సీ యజమాని కే శోభ తెలిపారు. హైదరాబాద్ వ్యాప్తంగా తమ అడ్వైర్టెజింగ్ కంపెనీ యాడ్ బోర్డులను తొ లగిస్తూ.. వారి కంపెనీల బోర్డులను ఏర్పా టు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘మా వెనుక సీఎం తమ్ముడు ఉన్నాడు.. ఇలాగే చే స్తాం.. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని నాలుగు నెలలుగా వేధిస్తున్నారని ఆమె వీడియో రిలీజ్ చేశారు. చెప్పినట్టు వినకుంటే యాడ్ ఆఫర్లు రాకుండా చేస్తామని కాల్స్ చేస్తూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
2024 మార్చి 18 నుంచి కొత్త బోర్డులకు అనుమతి ఇవ్వొద్దని జీహెచ్ఎంసీ సర్క్యులర్ విడుదల చేసినా.. వాటిని లెక్క చేయకుండా ఆ రెండు కంపెనీలు యునిపోల్స్, హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నాయని ఆరోపించారు. ఆ కంపెనీలకు జీహెచ్ఎంసీలోని కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు.