వర్గల్‌లోని ప్రసిద్ధ సరస్వతీ క్షేత్రంలో పూర్వయుగ సంసృతులను తెలిపే రాతిచిత్రాల తావులు ఉన్నట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ తెలిపారు. మెగాలిథిక్ సమాధుల జాడలు, రాష్ట్రకూటుల నాటి శాసనాలను గుర్తించినట్టు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
సరస్వతీ దేవతను కొండెకించి గుడికట్టిన చరిత్ర కొత్తదే అయినా గుట్ట కింద పాత గుడుల ఆనవాళ్లు ఉన్నట్టు వివరించారు. రాతిచిత్రాల్లో మధ్యరాతియుగపు కొంగ, సామూహిక మా నవ నృత్యాల పెయింటింగ్స్ ఉన్నాయని వెల్లడించారు.
మధ్యయుగాల(8,9వ శతాబ్దాల)నాటి తెలుగన్నడలిపిలో లఘుశాసనాలు వలయాకారంలో విడివిడిగా రాయబడి ఉన్నట్టు చెప్పారు. వాటిలో ‘వరగన్టి’, స్వస్తిశ్రీమల్ల, కల్గిని’ అని పేరొన్న శాసనభాగాలను గుర్తించామని తెలిపారు.
-హైదరాబాద్, (నమస్తే తెలంగాణ)