సంతోషం.. డబుల్

- ప్రైవేటు స్కూల్ సిబ్బంది ఖాతాల్లో రూ.22.56 కోట్లు జమ
- 1,13,600 మందికి సన్న బియ్యం సరఫరా
- లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు
- మరో నాలుగురోజులపాటు పంపిణీ
- ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి సర్కారు భరోసా
- ఆపత్కాలంలో ఆసరా దొరికింది: టీచర్లు
- 1,12,843 మందికి నగదు సాయం
- మిగిలినవారందరికీ నేడు అందజేత
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ)/ బడంగ్‌పేట/ కరీంనగర్ కార్పొరేషన్: ప్రైవేటు పాఠశాలల టీచర్లు, సిబ్బందికి రూ.2 వేల నగదు సాయం, 25 కిలోల సన్నబియ్యం పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. చాలాచోట్ల భార్యాభర్తలిద్దరూ సిబ్బందే కావడంతో ఖాతాల్లో జమైన నగదు అందుకుని మురిసిపోతున్నారు. కరోనా కష్టకాలంలో ఆకలితో అలమటిస్తున్న తమను సర్కారు ఆదుకుంటున్నదని సంతోషపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి నెలకు 25 కిలోల సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా అత్తాపూర్, బాలాపూర్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కరీంనగర్లో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, మహబూబ్‌నగర్‌లో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 వేల చొప్పున 1,12,843 మంది ఖాతాల్లో రూ.22.56 కోట్లు జమచేశామని మంత్రి సబితా తెలిపారు. బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను తప్పుగా నమోదుచేయడంతో కొంతమంది ఖాతాల్లో రూ.2 వేలు జమకాలేదని, గురువారంలోగా వీరందరికీ జమచేస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది రేషన్‌షాపు నంబర్లను పొరపాటుగా పేర్కొనడం వల్ల బియ్యం అందనివారికి.. రెండ్రోజుల్లో పంపిణీ చేస్తామని ఆమె ప్రకటించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేవరకు ప్రతినెలా ఈ సాయం కొనసాగుతుందని ఆమె చెప్పారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వాల్మీకి విద్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్ 25 కిలోల సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. మహబూబ్‌నగర్ జడ్పీ సమావేశ హాలులో బియ్యం, రూ.2 వేలను పంపిణీ చేశారు.
రాష్ట్రంలో ప్రైవేటు టీచర్లు, సిబ్బంది: 1,25,302 మంది
రూ.2 వేలు ఖాతాల్లో జమైనవారు: 1,12,843 మంది
ఖాతాల్లో జమచేసిన మొత్తం: రూ. 22.56 కోట్లు
రాష్ట్రంలో సన్న బియ్యం లబ్ధిదారులు: 1,13,600 మంది
పంపిణీ చేస్తున్న సన్నబియ్యం: 2,840 మెట్రిక్ టన్నులు
సన్నబియ్యం కోసం వెచ్చిస్తున్న మొత్తం: 10.75 కోట్లు
ఆర్థికంగా పెద్ద ఊరట
కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకోవడం హర్షణీయం. బియ్యం, నగదు ఇవ్వడంతో ఆర్థికంగా పెద్ద ఊరట లభించింది. చాలామంది ఇదంతా ఉత్తదే, బియ్యం ఇయ్యరు. డబ్బులు పడవు అన్నారు. కానీ, సీఎం కేసీఆర్ సర్ చెప్పారు కచ్చితంగా ఇస్తారని నాకు గట్టి నమ్మకముండే. ఆఖరుకు నా విశ్వాసమే నిజమైంది.
సూర్యచంద్ర, గీసుకొండ, వరంగల్
మా వెతలు తీర్చారు
16 ఏండ్లుగా ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నా. మార్చి 21 నుంచి జీతాలు ఆపేశారు. ఆగస్టులో ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి సగం జీతాలే ఇస్తున్నారు. వేరే దారిలేక టైలరింగ్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం మా వెతల తీర్చడం హర్షణీయం.
– సుబ్బలక్ష్మి, భరత్‌నగర్.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
Health tips | లావుపొట్టను ఇట్టే తగ్గించే ఈ డ్రింక్ గురించి మీకు తెలుసా..?
Cancer | మధుమేహం ఉన్నవారికి 21 రకాల క్యాన్సర్ల ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
Bandla Ganesh | చెక్ బౌన్స్ కేసు.. నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలుశిక్ష.. రూ.95 లక్షల జరిమానా..!
Acidity | ఎసిడిటీ, అజీర్తి సమస్యలు తరచూ వస్తున్నాయా..? అయితే అందుకు కారణాలు ఇవే..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

