రాజన్న సిరిసిల్ల, డిసెంబర్20 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన దూస గణేశ్(50) మరమగ్గాల పనిచేసేవాడు. గణేశ్‌కు భార్య సువర్ణ, కూతుళ్లు సుమశ్రీ, పూజిత ఉన్నారు. పలు ఫైనాన్స్ కంపెనీల్లో రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు.
కొంతకాలంగా ఉపాధి లేకపోవడంతో కిస్తీలు కట్టలేదు. దీంతో కిస్తీలు కట్టాలని వారు ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెంది గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. అప్పిచ్చిన వాళ్లు ఇబ్బంది పెట్టడంవల్లే తాను చనిపోతున్నట్టు సూసైడ్ లేఖ రాశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గణేశ్ నేతన్న బీమాలో చేరినట్టు చేనేత జౌలి శాఖ ఏడీ సాగర్ తెలిపారు.