మల్లాపూర్, ఏప్రిల్ 7 : వరంగల్లో ఏప్రిల్ 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం సివిల్ సప్లయ్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో విరాళం అందజేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చిగుళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం రూ. 1,14,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కే అశోక్, కే రమేశ్, సీహెచ్ అశోక్ పాల్గొన్నారు.