Gurukula Schools | హైదరాబాద్, ఫిబ్రవరి10 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులందరికీ ప్రతినెలా ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తముచ్చట్లుగానే మిగిలిపోతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీలో పరిస్థితి ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది. 10వ తేదీ దాటినా సొసైటీలో పనిచేస్తున్న సగం మందికిపైగా ఉద్యోగులకు జీతాలు పడలేదు. సొసైటీ పరిధిలో అన్నివిభాగాల్లో కలిపి మొత్తంగా 7000 మందికిపైగా టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు ఉన్నారు. వారిలో కేవలం 3000 మందికి మాత్రమే జీతాలు పడ్డాయని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. ప్రతినెలా ఇదే దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.