హల్దీవాగులోకి రెండ్రోజుల్లో జలాలు

- ఎండుతున్న పొలాలకు కొండపోచమ్మ నీళ్లు
- ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు వెల్లడి
- యావాపూర్‌లో పొలాలు,చెక్‌డ్యాంలు పరిశీలన
తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో గుంట భూమి కూడా ఎండిపోకుండా చూడటమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. మరో రెండ్రోజుల్లో కొండపోచమ్మసాగర్ నుంచి హల్దీవాగులోకి సాగునీరు వస్తుందని చెప్పారు. మెద క్ జిల్లా తూప్రాన్ మండలం యావాపూర్ చెక్‌డ్యాం పరిసరాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఎండిపోయిన చెక్‌డ్యాం, పంటపొలాలను పరిశీలించారు. సాగుచేసిన పంట లు ఎండిపోకుండా చూడాలని రైతులు వంటేరు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతుల కోరిక మేరకు ఇటీవల కూడవెల్లి వాగులోకి మల్లన్నసాగర్ నుంచి నీటిని విడుదల చేశారని తెలిపారు. హల్దీవాగులోని కాళేశ్వరం జలాల విడుదలతో సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, వర్గల్, మర్కూ క్, మెదక్ జిల్లాలోని తూప్రాన్, వెల్దుర్తి, నర్సాపూర్ మండలాలతోపాటు సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. హల్దీవాగు పరీవాహక ప్రాంతంలోని చెక్‌డ్యాంలు పొంగిపొర్లి.. వేల ఎకరాల బీడుభూములు సస్యశ్యామలమవుతాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్, వర్గల్ మండలాల మీదుగా తూప్రాన్ మండలంలోని యావాపూర్, కిష్టాపూర్, బ్రాహ్మణపల్లి, నాగులపల్లి చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకుంటాయన్నారు. ఇక్కడే గ్రామస్తులమం తా పండుగ జరుపుకొందామని ఆయన ప్రకటించడంతో జై కేసీఆర్.. జైజై కేసీఆర్ అంటూ రైతులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్‌గౌడ్, టీఆర్ఎస్ తూప్రాన్ మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, యావాపూర్ సర్పంచ్ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి : మంత్రి ఈటల
కర్ఫ్యూ, లాక్‌డౌన్‌కు అవకాశం లేదు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

