
బిహార్ రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ హకీం ప్రశంసలు
హైదరాబాద్, డిసెంబర్17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మైనారిటీ కమిషన్ పనితీరు అద్భుతంగా ఉన్నదని బీహార్ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ యూనస్ హుస్సేన్ హకీం ప్రశంసించారు. మైనారిటీల హక్కులు, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నదని కొనియాడారు. శుక్రవారం ఆయన తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ మాజీ చైర్మన్ మహ్మద్ కమ్రుద్దీన్, కమిషన్ కార్యదర్శి హరీశ్ చందర్సాహూతో భేటీ అయ్యారు. గత మూడేండ్లలో తెలంగాణ మైనారిటీ కమిషన్ పరిష్కరించిన కేసుల వివరాలు, చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మూడేండ్ల నివేదికలను కమ్రుద్దీన్ ఆయనకు అందజేశారు.