హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,023 గురుకుల, సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహా ర, వినియోగ వస్తువుల సేకరణకు సంబంధించి ఒకే విధానం అనుసరించాలన్న ప్రభుత్వ నిర్ణయం సబబేనంటూ హైకోర్టు సమర్థించింది. అన్ని గురుకులాలకు సరకుల సేకరణలో నాణ్యత, జవాబుదారీతనం కల్పించేందుకే ఈ విధానాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నది. ప్రభుత్వం జూలై 8న తీసుకొచ్చిన జీవో-17, ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ (పీఎంయూ) మార్గదర్శకాల రూపకల్పనలో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టంచేసింది.
కొన్ని సవరణలు అ వసరమని అభిప్రాయపడింది. లాటరీ విధానం సరికాదని, మహి ళా సమాఖ్య, గిరిజన సహకార సం ఘాలకు ముందే రిజర్వేషన్లు కల్పిం చి నోటిఫికేషన్లోనే వెల్లడించాలని సూచించింది. జీవో- 17ను సవా లు చేస్తూ తెలంగాణ గురుకుల కాం ట్రాక్టర్ల అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. ఏండ్ల తరబడి సరకులు సరఫరా చేసిన చిన్న కాంట్రాక్టర్ల జీవనోపాధి హక్కులనూ పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నదని పేర్కొన్నారు.