హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర మానవ హకుల కమిషన్ తొలి చైర్మన్, జస్టిస్ డాక్టర్ జి చంద్రయ్య(72) కన్నుమూశారు. కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్లో పరమపదించారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ మహాప్రస్థానంలో నిర్వహిస్తారని తెలిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చంద్రయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లా పూర్తి చేశారు.
యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పీహెచ్డీ పట్టా అం దుకున్నారు. తెలంగా ణ రాష్ట్రం నుంచి హై కోర్టుకు ఎదిగిన దళితవర్గాలకు చెందిన మొట్టమొదటి న్యాయమూర్తిగా పేరుగాంచారు. ఆయన మృతిపట్ల డాక్టర్ బీఆర్ అంబేదర్ మెమోరియల్ ట్రస్ట్, దళిత బహుజన సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలు, ప్రజాసంఘాలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశాయి. జస్టిస్ చంద్రయ్య బీఆర్ అంబేదర్ మెమోరియల్ ట్రస్ట్ గౌరవ సభ్యుడు. తెలంగాణ రాష్ట్ర మానవ హకుల కమిషన్ చైర్మన్‌గా మంచి పేరు సంపాదించారు. ఆయనకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. ఏజీపీ, జీపీగా కూడా పనిచేశారు.
జస్టిస్ చంద్రయ్య మృతిపట్ల మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్‌కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు జడ్జిగా, మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా ప్రజలలో జస్టిస్ చంద్రయ్య చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.
న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణకు జస్టిస్ చంద్రయ్య విశిష్ట సేవలు అందించారని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. జస్టిస్ చంద్రయ్య మృతి పట్ల శనివారం తీవ్ర సం తాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుం చి హైకోర్టు న్యాయమూర్తిగా ఎదిగిన దళితవర్గాలకు చెంది న తొలి న్యాయమూర్తిగా ఆయన ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.