Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇటీవల గన్‌కల్చర్ విపరీతంగా పెరిగిందనడానికి వరుసగా జరుగుతున్న ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్, మెదక్‌లో జరిగిన కా ల్పుల ఘటనల నేపథ్యంలో ఎప్పుడెటువైపు గన్ పేలుతుందో.. ఏ ప్రాంతంలో తుపాకులు మోగుతాయో తెలియని పరిస్థితుల్లో రాష్ట్రం వణికిపోతున్నది. ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విపరీతంగా తుపాకుల మోత వినిపిస్తున్నది. ఉత్తరాది నుంచి నగరానికి వస్తున్న అక్రమ ఆయుధాలతో కాల్పుల ఘటనలు పెరిగాయి. రాష్ట్రంలో ఎప్పు డూ లేనంతగా తుపాకులను విరివిగా వాడే సంస్కృతి రావడంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. పోలీసుల నిఘా ఉండకపోవడంతో ఏడాదిన్నరగా నేరాల శాతం పెరుగుతున్నది. బీహార్, యూపీలాంటి రాష్ర్టాలకే పరిమితమైన ఈ గన్‌కల్చర్ ఇప్పుడు తెలంగాణకూ చేరుకోవడం ఆందోళన కలిగించే అంశం.
ఇటీవల జరిగిన ఘటనలు
హైదరాబాద్, మెదక్‌లో జరిగిన ఘటనలతో పాటు ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో సైబరాబాద్ సీసీఎస్ పోలీసులపై, ఇదే నెలలో గాజులరామారంలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద క్యాషియర్‌పై, జనవరిలో హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో బీదర్ దొంగల ముఠా జరిపిన కాల్పులు సంచలనం రేపాయి.
ఆ జిల్లాల్లోనే ఎక్కువ..!
రాష్ట్రంలో ఈ గన్‌కల్చర్ ఆందోళన కలిగిస్తున్నది. లైసెన్స్డ్ గన్స్, కంట్రీమేడ్ రివాల్వర్స్, ఎయిర్ గన్స్ ప్రజల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రాష్ట్రంలో అనుమతులు లేని తుపాకుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పోలీసు లు గుర్తించారు. బీహార్, యూపీ నుంచి అక్ర మ మార్గంలో తుపాకులు కొనుగోలు చేసి తెస్తున్నట్టుగా నిర్ధారించారు. రాష్ట్రంలో 7,12 5 చెల్లుబాటు అయ్యే ఆయుధ లైసెన్సులు, 9,294 రిజిస్టర్డ్ ఆయుధాలున్నాయని చెప్పా రు. గత మూడేండ్లలో కేవలం 510 మాత్రమే లైసెన్సులు జారీ చేశామని పేర్కొన్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇలా ఉన్నా, నాలుగైదు రెట్లకు పైగా ఆయుధాలున్నట్టుగా తెలుస్తున్న ది. హైదరాబాద్‌లో ఎక్కువగా అక్రమ ఆయుధాల వినియోగం ఉండగా, నిర్మల్, జనగామ, వికారాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో కూడా వీటి వినియోగం ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తున్నది.
సిటీలోకి రవాణా అక్కడినుంచే..!
కొందరు ఆయుధాలను హోదాగా భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఆధిపత్యం చెలాయించేందుకు, పంచాయితీలకు, ప్రత్యర్థులను బెదిరించడానికి వాడుతున్నారు. దీంతో ఈ వ్యాపారం మూడు గన్లు.. ఆరు బుల్లెట్లలా విరాజిల్లుతున్నది. లైసెన్స్డ్ ఆయుధాలతో కాల్పులు జరిపితే దొరికిపోతామనే ఆలోచనతో నాటుతుపాకులు వాడుతున్నారు. బీహార్, రాజస్థాన్, యూపీ, ఢిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే అంతర్రాష్ట్ర ముఠాల దగ్గర గన్స్ కొనుగోలు చేస్తున్నారు. అక్రమాయుధాలను రాజస్థాన్‌లోని జయపుర, బీహార్‌లోని గయ, ముంగేర్, పాట్నా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, బర్వానీలో చాలా సులభంగా తయారుచేస్తున్నారు. తుపాకుల డిమాండ్‌ను బట్టి వీటి ధర రూ.2వేల నుంచి రూ.30వేల వరకు చెల్లించి కొందరు కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ర్టా ల్లో కొన్నప్పుడు 30వేలు ఉన్న కంట్రీమేడ్ రివాల్వర్, హైదరాబాద్ చేరుకునేసరికి నాలుగైదు రెట్లు పెరుగుతున్నదని అధికారులు చె ప్పారు. కొందరు రౌడీషీటర్లు, భూకబ్జాలు, సెటిల్మెంట్ల కోసం వీటిని కొనుగోలు చేస్తున్న ట్టు పేర్కొన్నారు. వీటి రవాణాకు నేరగాళ్లు ప్రైవేటు ట్రావెల్ బస్సులు, రైళ్లను ఉపయో గిస్తున్నారు. ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లకు బదులుగా, ప్రయాణికులు తక్కువగా ఉండే స్టేషన్లలో దిగిపోతారు. అక్కడి నుంచి బైక్స్, ప్రైవేట్ వెహికల్స్‌లో ప్రయాణం చేసి సరఫరా చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.
గ్రేటర్లో 80% అక్రమ ఆయుధాలే!
గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 11,841 లైసెన్స్డ్ గన్స్ ఉన్నట్టు తెలుస్తున్నది. వాటిలో 978 స్పోర్టస్, ఎక్స్ సర్వీస్‌మెన్,, సెక్యూరిటీ ఏ జెన్సీలకు చెందినవే ఉన్నాయి. అనధికారికంగా 40వేల వరకు ఉన్నట్టుగా పోలీసు లు అంచనా వేస్తున్నారు. గ్రేటర్లో నమోదవుతున్న నేరాల్లో 40% ఆయుధాలకు సంబంధించినవే కాగా.. అక్రమ ఆయుధాల్లో 80% వరకు రాజధానిలోనే ఉన్నాయని తెలుస్తున్నది. గతంలో కరుడుగట్టిన నేరస్తుల వద్ద మాత్రమే ఆయుధాలుండేవి కాగా ఇప్పుడు పాతబస్తీతోపాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో కొందరు రియల్టర్లు, రౌడీషీటర్ల వద్ద అత్యాధునిక పిస్టళ్లు, రివాల్వర్లు, తుపాకులు ఉంటున్నాయి. సాధారణంగా గన్‌లైసెన్స్‌లు పొందిన వారిని స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రతీ మూడునెలలకొకసారి తనిఖీ చేయాలి. గన్‌లో బుల్లెట్ల సంఖ్య కరెక్ట్‌గా ఉందా.. లేదా సమీక్షించాలి. కానీ స్థానిక పోలీసులు అలాంటి తనిఖీలే చేపట్టడం లేదు. సరైన నిఘా లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ నాటు తుపాకులు దొరుకుతున్నాయి.
నాటు ఆయుధాల ధరలు ఇలా..!