NRI | కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరుకున్న కొడంగల్ గల్ఫ్ బాధితురాలు
NRI | బతుకుదెరువు కోసం మస్కట్( Muscat)వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న తుప్పుడు లక్ష్మి అనే మహిళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో క్షేమంగా ఇంటికి చేరుకుంది.
NRI | బతుకుదెరువు కోసం మస్కట్( Muscat)వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న తుప్పుడు లక్ష్మి అనే మహిళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో క్షేమంగా ఇంటికి చేరుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు(Kodangal) చెందిన లక్ష్మి కొద్ది రోజుల కోసం ఉపాధి నిమిత్తం మస్కట్ దేశానికి వెళ్లింది. అక్కడ పని ప్రదేశంలో ఇబ్బంది పడుతున్న లక్ష్మిని తిరిగి స్వదేశానికి వచ్చేలా చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులను ఆమె కొడుకు వేడుకున్నాడు.
రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినా కూడా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోకపోవడంతో చివరికి బాధితురాలి కొడుకు రాజు కేటీఆర్‌ను కలిసి తన బాధను చెప్పుకున్నాడు. కేటీఆర్ ఆదేశాలతో మస్కట్ బీఆర్ఎస్ శ్రేణులు లక్ష్మిని రక్షించి స్వదేశానికి పంపించారు. కాగా, ఈరోజు(మంగళవారం) ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బాధితురాలు లక్ష్మి, ఆమె కుమారుడు రాజు కలవనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

