
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని ప్రధానోపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయుడు రుచి చూసి రిజిస్టర్లో నమోదు చేయాలని, ఆ తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ విధానాన్ని ప్రతిరోజూ పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన మంగళవారం మార్గదర్శకాలను విడుదల చేశారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వంటకాల్లో నాణ్యమైన డబుల్ ఫోర్టిఫైడ్ ఉప్పును మాత్రమే వినియోగించాలని తెలిపారు. టేస్టింగ్ రిజిష్టర్తోపాటు, బియ్యం నిల్వలు, పంపిణీ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ మినిట్స్, భోజనాన్ని స్వీకరించిన వారి రిజిస్టర్లను వేర్వేరుగా నిర్వహించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.