హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎకో టూరిజం రంగంలో పెరుగుతున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని పర్యాటకశాఖ డైరెక్టర్ రంజిత్‌నాయక్ సూచించారు. సోమవారం హైదరాబాద్‌లో ‘హాస్పిటాలిటీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ’ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమబద్ధమైన శిక్షణ, ఉపాధి ఆధారిత కార్యక్రమాల ద్వారా స్థానిక, గిరిజన యువతకు సాధికారత కల్పించడమే తమ ధ్యేయమని చెప్పారు.
32 మంది గిరిజన, ఆర్థికంగా వెనుకబడిన యువతకు వంట, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్, హౌస్ కీపింగ్, ఫుడ్-బెవరేజ్ సర్వీస్‌లలో శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ సీఈవో మయూర్ పట్నాల, ఎన్ఐటీహెచ్ఎం డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణ, టీజీఎఫ్డీసీ అధికారులు శిరీష, శ్రీనివాసరావు, సుమన్, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.