హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) బుధవారం రాత్రి 12 గంటల తరువాత విడుదల చేసింది. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణుల జాబితాను తమ వెబ్సైట్లో ప్రచురించింది.
ఈ ఏడాది మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల మెయిన్స్ హాల్టికెట్ నంబర్లను వెబ్సైట్లో ఉంచినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం 563 పోస్టులకు గాను 562 మంది అభ్యర్థులను ఎంపిక చేసిన టీజీపీఎస్సీ ఒక పోస్టును ఖాళీగా ఉంచింది. ఈ ఫలితాలు హైకోర్టులో విచారణలో కేసులపై వెలువడే తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.