హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని భూగర్భ జల వనరులశాఖలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫైనల్ కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. 2023 జూలైలో ఈ పరీక్షలు నిర్వహించగా, తుది కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం విడుదల చేసింది.