Grok Chatbot | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దీనిపై మీడియాలో కథనాలూ వెలువడ్డాయి. బీఆర్ఎస్ సభ, కేసీఆర్ ప్రసంగం, ప్రజాస్పందనపై ఏఐ చాట్బాట్లను ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి ప్రశ్నించగా ఆయా చాట్బాట్లూ ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి.
ప్రశ్న: బీఆర్ఎస్ సభ సక్సెస్ అయిందా?
గ్రోక్: అవును. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైంది. ఈ సభకు ప్రజలు భారీగా వచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజల నుంచి ఉత్సాహభరితమైన స్పందన వచ్చింది.
చాట్ జీపీటీ: ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సభకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.
ప్రశ్న: కేసీఆర్ ప్రసంగం ఎలా సాగింది?
గ్రోక్: కేసీఆర్ ప్రసంగం ఆనాటి తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని రగిలించింది. చివరివరకు ఉద్వేగభరితంగా, ప్రజలను, కార్యకర్తలను ఉత్తేజపరిచేలా సాగింది. లక్షలాది మంది హాజరైన ఈ సభలో కేసీఆర్ తన పాత శైలిలో ప్రత్యర్థులపై విమర్శలను ఎక్కుపెట్టడమే కాకుండా పార్టీ బలాన్ని కూడా చాటారు. పార్టీ భవిష్యత్తు దిశను చూపుతూ సాగిన ఒక శక్తిమంతమైన ప్రసంగమని చెప్పొచ్చు.
చాట్‌జీపీటీ: రజతోత్సవ సభలో కేసీఆర్ గర్జించారు. ఆయన ప్రసంగం చివరివరకు ఉద్వేగభరితంగా సాగింది.
ప్రశ్న: కేసీఆర్ ప్రసంగానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది?
గ్రోక్: కేసీఆర్ ప్రసంగంలో ఉద్యమ స్ఫూర్తిని, రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని ఉద్ఘాటించడంతో సభకు హాజరైన లక్షలాది మంది ప్రజలు హర్షధ్వానాలతో, చప్పట్లతో స్పందనను తెలియజేశారు. తెలంగాణ పోరాట జ్ఞాపకాలు, బీఆర్ఎస్ విజయాలను ప్రస్తావించినప్పుడు ప్రజలు ఉద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నప్పుడు జనం హర్షం వ్యక్తంచేశారు. ప్రజాస్పందన చూస్తుంటే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని అర్థం చేసుకోవచ్చు.
చాట్‌జీపీటీ: కేసీఆర్ ప్రసంగం సాగుతున్నంతసేపూ ప్రజల్లో ఉత్సాహం కనిపించింది. ప్రసంగ సమయంలో ప్రజల స్పందనను చూస్తే తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వేసిన శాశ్వతమైన ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
జాతీయ మీడియాలో ‘రజతోత్సవ సంబురం
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జాతీయ మీడియాలోనూ విస్తృతంగా కవరేజీ లభించిం ది. ఇంగ్లిష్‌లో ప్రధాన న్యూస్ వెబ్సైట్లు కేసీఆర్ ప్రసంగాన్ని ప్రముఖంగా ప్రచురించా యి. పలు టీవీ ఛానల్స్ కూడా సభ వివరాలను, వీడియోలను ప్రసారం చేశాయి. ముఖ్యంగా ‘కగర్ ఆపరేషన్ పేరిట ఛత్తీస్‌గఢ్‌లో కేంద్రప్రభుత్వం యువకులను, గిరిజనులను ఊచకోత కోస్తున్నది’ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ అంశాన్నే హెడ్‌లైన్‌గా మార్చి పలు వెబ్సైట్లు కథనాన్ని ప్రచురించాయి. తెలంగాణకు నంబ ర్-1 విలన్ కాంగ్రెస్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలను కూడా మరికొన్ని న్యూస్ వెబ్సైట్లు త మ కథనాలకు శీర్షికలుగా పెట్టాయి. మొత్తంగా బీఆర్ఎస్ సభ విజయవంతమైందంటూ కథనాల్లో పేర్కొన్నాయి.
ఇంగ్లీష్ న్యూస్ వెబ్సైట్లలో హెడ్‌లైన్స్
ది హిందూ: కేసీఆర్ సర్ప్రైజెస్ బై రేకింగ్అప్ మావోయిస్ట్ ఇష్యూ
సౌత్‌ఫస్ట్: కేసీఆర్ డిమాండ్స్ హాల్ట్ టు ఆపరేషన్ కగార్
పీటీఐ: కేసీఆర్ అర్జెస్ సెంటర్ టు హాల్ట్ ‘ఆపరేషన్ కగార్’
ది స్టేట్మన్: కేసీఆర్ డబ్ కాంగ్రెస్ యాజ్ విలన్ నంబర్ వన్ ఫర్ తెలంగాణ
టైమ్స్ ఆఫ్ ఇండియా: బీఆర్ఎస్ రింగ్ ఇన్ సిల్వర్ జూబ్లీ మీటింగ్
ది న్యూస్ మినట్: బీఆర్ఎస్ సెలబ్రేటెడ్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ ఇన్ వరంగల్
డెక్కన్ హెరాల్డ్: బీఆర్ఎస్ సెలబ్రేటెడ్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ ఇన్ వరంగల్
సియాసాత్ : కాంగ్రెస్ నంబర్ 1 విలన్ ఆఫ్ తెలంగాణ.. విల్ నాట్ థ్రోఅవుట్ గవర్నమెంట్: కేసీఆర్