హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మత సామరస్యం వెల్లివిరియాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. దానిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని సూచించారు. బుధవారం ఉపవాస దీక్షలతో, భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి జరుపుకుంటున్న హిందువులకు, హిందూ ముస్లింలు ఐక్యంగా జరుపుకుంటున్న మొహర్రం పర్వదినాలను పురస్కరించుకొని ఆయన రాష్ట్ర ప్రజలకు ఒక ప్రకటనలో ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గంగా, జమునా సంస్కృతికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కేసీఆర్ ప్రార్థించారు.