కొత్త నవోదయాల్లో అడ్మిషన్లకు పచ్చజెండా.. రెండో విడతలో ప్రవేశాలు
రాష్ర్టానికి మంజూరైన ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.
- జూలై 14 నుంచే తరగతులు
- తాత్కాలిక క్యాంపస్‌లోనే క్లాసులు
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టానికి మంజూరైన ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. రెండో విడతలో 6వ తరగతిలో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించనున్నారు. జూలై 14 నుంచే తాత్కాలిక క్యాంపస్‌లోనే తరగతులు నడుస్తాయి. జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మలాజిగిరి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఈ విద్యా సంవత్సరానికి నవోదయాల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇటీవల విడుదలైన అడ్మిషన్ నోటిఫికేషన్లో మాత్రం ఈ విద్యాలయాల పేర్లను చేర్చలేదు.
ఇప్పటికే ఉన్న 9 నవోదయాల్లోనే అడ్మిషన్లు ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇదే విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 3న ‘నవోదయ.. ఈ సారి అడ్మిషన్ లేదయా’ శీర్షికతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో నవోదయ విద్యాలయాలపై విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా సోమవారం సచివాలయంలో అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొత్తగా మంజూరైన నవోదయ విద్యాలయాలను ప్రారంభించే చర్చించారు. మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, విద్యాప్రణాళిక, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవడం వంటి అంశాలపై దృష్టిసారించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

