హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబరు 9 (నమస్తే తెలంగాణ): ఉష్ణోగ్రతలు సాధారణస్థాయి కంటే దిగువకు పడిపోవడంతో గ్రేటర్ హైదరాబాద్లో చలి తీవ్రత పెరుగుతున్నది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో 30.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, 17.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 43శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.