దుండిగల్, మార్చి 28 : రోగులకు సేవాభావంతో వైద్యసేవలు అందించాలని కాళోజీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ నందకుమార్‌రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలోని మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హాస్పిటల్స్‌లో శుక్రవారం ఎంబీబీఎస్ (2019 బ్యాచ్) పూర్తిచేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. నందకుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎంబీబీఎస్ పూర్తిచేసిన 133 మంది, నర్సింగ్ పూర్తిచేసిన 42 మందికి పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మమత ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పువ్వాడ నయన్‌రాజ్, డీన్ హరికృష్ణ, మెడికల్ సూపరింటెండెంట్ సురేశ్‌కుమార్ పటేల్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ ప్రణీత్‌కుమార్, కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ నవీన్‌కుమార్ పాల్గొన్నారు.